Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1415.94 కోట్లతో రుణ ప్రణాళిక
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
వ్యవసాయ రంగానికే అధిక నిధులు కేటాయిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. మొత్తం రూ.1415.94 కోట్లతో వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికను ఆయన ప్రకటించారు. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన శుక్రవారం డీసీసీ, డీఎల్ఐసీ, డీఎల్ఎస్సీ సమావేశం నిర్వహించగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరాంజనేయులు మాట్లాడారు. ఈ ఏడాదికి రూ.1415.94 కోట్లతో రుణ ప్రణాళిక చేసినట్టు తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని 8 రకాల బ్యాంకులు వివిధ అభివద్ధి, నిరుద్యోగ, హౌసింగ్, ఎడ్యుకేషన్, తదితర రుణాలను అర్హులైన రైతులకు సకాలంలో పంట రుణాలు అందించేలా బ్యాంకర్లు కషి చేయాలన్నారు. జిల్లా ప్రజలకు అర్హత మేరకు రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలోని బ్యాంకుల టార్గెట్లు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల నుంచి బ్యాంకు రుణాల రికవరీ శాతం పెరిగితే అనుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయొచ్చన్నారు. దీనిపై అధికారులు దష్టి సారించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ, సంక్షేమ పథకాల అమలును సకాలంలో పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ 5 నుంచి 10 మంది కలిసి ఎస్‌హెచ్‌జీ గ్రూపుగా ఏర్పడవచ్చరని చెప్పారు. తొలుత జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐటీడీఏ పీఓ హన్మంతు కె జండగే, డీఆర్డీఓ నాగ పద్మజ, కార్పొరేషన్ ఈడి తుల రవి, తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఏటా జూన్ 12న బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ హన్మంతు కె జండగే, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.