Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాబార్డ్ ఉమ్మడి జిల్లా అధికారి అబ్దుల్ రవూఫ్
నవతెలంగాణ-రఘునాథపల్లి
సేంద్రియ పంటలు పండిస్తే అధిక లాభాలు సాధించొచ్చని నాబార్డ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారి అబ్దుల్ రవూఫ్, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. నాబార్డ్ సహకారంతో మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మేకలగట్టు గ్రామంలో 2021-24 సంవత్సరాలకు గాను క్లైమట్ ఫ్రూఫింగ్ ప్రాజెక్ట్ (సీపీపీ) పనులను వారు శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు అధిక శాతం వరి పంటపైన ఆధారపడుతున్నారని తెలిపారు. కూరగాయలు, పందిళ్ల కూరగాయలు, డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తే అధిక లాభాలొస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ ఆధికారి శ్రీనివాస్‌రెడ్డి, మేకలగట్టు సర్పంచ్ సంధ్యారాణి కిరణ్‌కుమార్, రామరాయిని బంగ్లా సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ భిక్షపతి నాయక్, మేకలగట్టు వాటర్ షెడ్ కమిటీ సభ్యులు అంజనేయులు, గడ్డమీది శేఖర్, సమ్మయ్య, ఉడుత సురేష్, ఆవుల లక్ష్మీ, పరశురాములు, మారి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ జయరామారావు, మారపాక వెంకటస్వామి, బొంకూరు యాదగిరి, సునీల్, తదితరులు పాల్గొన్నారు.