Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 6 గంటల నుండి 10 వరకు సడలింపు
- సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరగడంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి, ఉప సర్పంచ్ అజ్మేరా జోయి తెలిపారు. గ్రామంలో గతంలో 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం 6 కోవిడ్ కేసులు నమోదు కావడంతో గురువారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారి డాక్టర్ నాగ శశికాంత్ గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి లాక్ డౌన్ ప్రకటిస్తే కరోనా ఉధతి నివారించుకోవచ్చని సూచించారు. వైద్య సిబ్బంది ఆదేశాల మేరకు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరగకుండా ఉండడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు శుక్రవారం నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఉంటు ందని, ఈ సమయంలో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసు కోవాలని సూచించారు. 10 గంటల తర్వాత ఎవరైనా దుకాణాలు తెరిచిన 5 వేలు జరిమానా విధిస్తామని, అన వసరంగా బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చ రించారు. అనంతరం గ్రామం లోని పాజిటివ్ కేసులు కలిగిన వీధులలో మల్టీపర్పస్ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ప్రజలు సహకరించాలని కోరారు.