Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ వెంకటరాణి సిద్దు
నవతలెంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి నుంచి చెల్పూర్ వరకు నాలుగు లైన్ల రహదారికి రూ. 50 కోట్ల నిధులు గతవారం మంజూరయ్యాయని అతి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్టు భూపాలపల్లి మున్సిపల్ చైర్మెన్ వెంకటరాణి సిద్దు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భూపా లపల్లి పట్టణంలో మెయిన్ రోడ్ గుంతలు పడ్డాయని రోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడు తునా ్నయన్నారు. గతంలో మున్సిపాలిటీ పాలకవర్గం ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన అంచనాలు తయారు చేయించినట్టు తెలిపారు.ఈ నిధులతో చెల్పూర్ నుండి భూపాలపల్లి బాంబుల గడ్డ వరకు రోడ్డుకిరువైపులా డ్రైనేజీ మరియు బీటీ రెన్యువల్ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు నాగుల శిరీష దేవేందర్ రెడ్డి, పానుగంటి హారిక శ్రీనివాస్, ఎడ్ల మౌనిక శ్రీను, ముంజంపల్లి మురళీధర్, ముంజల రవీందర్ గౌడ్ నాగవెల్లి సరళ రాజ లింగమూర్తి, పిల్లలమర్రి శారద నారాయణ తదితరులు పాల్గొన్నారు.