Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని వక్ఫ్ బోర్డ్ ఉన్నతాధికారులు
- చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ప్రముఖ యాత్ర స్థలమైన అన్నారం షరీఫ్ దర్గాలో కాంట్రాక్టర్లు కోవిడ్ వ్యాపిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. గ్రామంలోని కొందరు అధికార పార్టీ నాయకులు,లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి చట్టం వారి చుట్టం అనేలా దర్జాగా దందా నడిపిస్తున్న అధికారులు అటు వైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి వక్ఫ్ బోర్డ్ అధికారులు దర్గా మూసివేస్తే ,కాంట్రాక్టర్లు నయా దందాకు తెరలేపారు. మూసి ఉన్న దర్గా ప్రధాన ద్వారా నికి ఎదురుగా హుండీని ఏర్పాటు చేసి దర్గా ద్వారానికి కర్ర తో చేసిన దొర్లు తెరిచి ఇనుప జాలీతో ఉన్న డోర్ మాత్రం తాళం వేశారు. లాక్ డౌన్ నిబంధనలు అను సరించి వచ్చే భక్తులు దర్గా ప్రధాన ద్వారం ద్వారా కనపడే దేవుని చూసి మొక్కుకొనే వారు ఇక్కడే కాంట్రాక్టర్లు వారి తెలివి ప్రదర్శించి దర్శనానికి,యా ట కోడి కందూర్ చేసే భక్తులకు భక్తుల వద్ద నుంచి 300 నుంచి 1000 రూపాయలు నిర్బందంగా వసూలు చేస్తున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. శుక్రవారం అధికారుల దష్టికి వెళ్లడం తో పోలీసులు వచ్చి వారి వద్ద నుండి టికెట్ బుక్కులు మాత్రం తీసుకొని,హుండీ సీజ్ చేయకపోవడం కేసు నమోదు చేయకుండా వదిలివేయడం చూస్తే చట్టం ముందు అందరూ సమానమేన అనుమానం కలుగుతోంది. పోలీసులు వచ్చి వెళ్లిన వెంటనే ఏలాంటి భయం లేకుండా మళ్ళీ టికెట్లు అమ్ముతూ భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి హుండీలలో వేసుకుంటున్న భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వారికి అధికార పార్టీ నాయకుని అండ ఉందని అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలోని ఒక నాయకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్గా వద్దనే ఉంటూ ఆయన కనుసన్నల్లోనే ఈ తతంగం నడిపిస్తున్నదనే వాద నలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వక్ఫ్ బోర్డ్ ఉన్న తాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారానని భక్తులు ఎదురు చూస్తున్నారు. న