Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్
నవతెలంగాణ-మహదేవ్పూర్
కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని బ్రాహ్మణపల్లి, ఎల్కేశ్వరం, పెద్దంపేట, పాలిమేల మండలంలోని లెంకల గడ్డ, సర్వాయి పేట గ్రామాల్లో రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు బాల రక్షా భావన్ కోఆర్డినేటర్ కె.శిరీష, మహాదేవపూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఆర్.రాధిక తో కలిసి కరోనా బాధిత బాలల కుటుంబాలకు బాల సహాయ పౌష్టికాహార కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధతంగా ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండా లన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల్లో కరోనా బారిన పడిన పిల్లల కుటుంబాలకు పౌష్టికాహార కిట్లను అందించామన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా కోవిడ్ తో బాధపడుతున్న పిల్లలు గానీ లేదా కోవిడ్ తో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు గానీ ఎవరైనా ఉంటే 040-23733665 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు గానీ సమాచారం అందిస్తే వెంటనే వారిని రక్షించే దిశగా తగు చర్యలు తీసుకోబడునన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, ఎల్సీపీఓ మోహినోద్దీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్, సోషల్ వర్కర్ శైలజ, అంగన్వాడీ టీచర్లు నిర్మల కవిత, ఎలేంద్ర తదితరులు పాల్గొన్నారు.