Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, కేవీపీఎస్
నవతెలంగాణ-పర్వతగిరి
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మండలం లోని అన్నారం షరీఫ్ గ్రామంలో వరి ధాన్యాల కేంద్రాలను ప్రజా సంఘాల నాయకులు జిల్లా రమేష్, పోడేటి దయాకర్లు శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురిసిన భారీ వర్షాల వల్ల మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతాంగం ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిచి నందున ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రతి రైతు నష్టపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి పంటను తేమ పేరా దుమ్ము, ధూళి పేరుతో మిల్లర్లు రైతు వద్ద నుండి ప్రతి క్వింటాలుకు ఎనిమిది కేజీలు తరుగు తీస్తున్నారని మార్కెట్ బైలా ప్రకారం క్వింటాకు మూడు కేజీలు తరుగు తీయాల్సి ఉండగా మిల్లర్లు కొనుగోలు కేంద్రాల వారు కుమ్మకై రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. 41 కేజీల బస్తా కు 5 నుంచి ఆరు కేజీల ధాన్యం కటింగ్ చేస్తున్నారని దీని ద్వారా రైతుల జీవితాలు ప్రశ్నా ర్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్ బైలా ప్రకారం ధాన్యం తరుగు తీయించి రైతాంగానికి న్యాయం చేయాలని ట్రాన్స్ పోర్ట్ కొరకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. లేనియెడల రైతాంగాన్ని ఐక్యం చేసి ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య,కొమ్మాలు, పైడి.కుమార్, మహేందర్, స్వామి, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.