Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ విప్ వినరు భాస్కర్
నవతెలంగాణ-న్యూశాయంపేట
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్ అన్నారు. .శుక్రవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్పొ రేటర్లతో హన్మకొండలోని హోటల్ అశోక కన్వెన్షన్లో మేయర్ గుండు సుధారాణి, ఇతర నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షకాలాన్ని దష్టిలో పెట్టుకొని ఆయా డివి జన్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు అందరూ అప్రమత్తతో ఉండి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తు వాటి పరిష్కార దిశగా అడుగులు వేయాలని డివిజన్ అభివద్ధి పనులు విధి విధానాలను వాటి రూపకల్పనకై అనుసరించాల్సిన పద్ధతులపై చర్చలు జరిపారు. ప్రతి సమస్యను పరిష్క రించేందుకు కార్పోరేటర్లు కషి చేయాలని మీ పరిధిలో పరిష్కారం కానీ సమస్యలను తన దష్టికి గాని అధికారుల దష్టికి తీసు కురావాలని కోరారు. వర్షాకాలం ప్రారం భమైంది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మెన్ ఆజీజ్ ఖాన్, కూడా డైరెక్టర్ శివ శంకర్ , నాయకులు సుందర్ రాజ్ యాదవ్, జనార్దన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.