Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గార్డెన్ వర్కర్ల పనులు వెంటనే కొనసాగించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కార్యదర్శి కుడుదుల వెంకటేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని జీఎం కార్యాలయం ముందు గార్డెన్ వర్కర్లతో ధర్నా చేసిన అనంతరం జనరల్ మేనేజర్ కు ,ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గార్డెన్ వర్కర్లు గ వారం పది రోజులుగా పనులు లేక అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు రద్దయి వారం పది రోజులు గడుస్తున్నా కొత్త టెండర్లు నిర్వహించి గార్డెన్ వర్కర్లకు ఉపాధి కల్పించకపోవడం దారుణమన్నారు. 6 సంవత్సరాలుగా గార్డెన్ పనిచేస్తూ ఏరియా లోని వివిధ కార్యాలయాలలో, పార్కులలో మొక్కలను పచ్చదనాన్ని కాపాడిన వర్కర్లు వీధిన పడే పరిస్థితి తలెత్తిందని వెంటనే కొత్త టెండర్లు పిలిచి గార్డెన్ వర్కర్లను ఆదుకోవాలని, లేనిచో దశలవారీగా ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనిత, శ్యామల, సుమలత ,జ్యోతి, సమ్మక్క, రమా, తిరుమల, అనూష, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.