Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం
- రోడ్డుపై రైతుల ధర్నా
నవతెలంగాణ-జనగామ
తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్య క్షుడు ధర్మబిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మండలంలోని అడవి కేశ్వాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై రైతులు శుక్రవారం తడిచిన ధాన్యంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడారు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలోని 50 శాతం ధాన్యం తడిచిందని చెప్పారు. కొనుగోళ్ల కోసం 2 నెల్లుగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు, మిల్లుకు తరలింపులో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలొ రైతులు బన్సి సిద్దారెడ్డి, నరేందర్, బాలనర్సయ్య, పూర్ణమ్మ, రంగమ్మ, కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరులో రైతుల రాస్తారోకో
పాలకుర్తి : మండలంలోని చెన్నూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండదల కార్యదర్శి చిట్యాల సోమన్న మాట్లాడారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. చెన్నూరులో సుమారు 8600 బస్తాల ధాన్యం కాంటా అయినా పది రోజులుగా లారీలు రాకపోవడంతో మిల్లుకు తరలించలేదని చెప్పారు. వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తే పరిస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో అనిల్ చౌహాన్, గునిగంటి సోమేశ్వరరావు, లావుడ్య ఇస్తారి, లావుడ్య చిలుక, లావుడ్య తిరుపతి, శ్రీనివాస్, పి సోమన్న, కరుణాకర్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.