Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
కరొన వైరస్ నియంత్రించుటకు సూపర్ స్పైడర్లకు శుక్రవారం ఎనిమిది కేంద్రాల్లో 10841 మందికి వ్యాక్సిన్ వేశారని వరంగల్ మహానగర పాలక సంస్థ సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఆర్ ఆర్ గార్డెన్ శంభుని పేట 1436 , వరంగల్ కొత్తవాడ విన్నర్ వీల్ ఫంక్షన్ హల్లో 1874, విష్ణు ప్రియ గార్డెన్ 2119, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మడికొండ 1521, జీఎం ఆర్ గార్డెన్ భీమారం 1713, ఏనుమాముల న్యూ గ్రెయిన్ మార్కెట్ 357 ,గుజరాతీ సమాజ్ వాదీ ఫంక్షన్‌హాల్ ఎస్సారార్ తోట 973, ఎన్ ఎస్ బాంక్వెట్ హాల్ కాకతీయ యూనివర్శిటీ క్రాస్‌రోడ్ హన్మకొండ 848, మొత్తం పది వేల ఎనిమిది వంద నలభ్కె ఒకటి మంది వాహకులను టీకాలు వేశారని ఆయన తెలిపారు. విష్ణు ప్రియ గార్డెన్ కేంద్రం లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రంను కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ జోనా సందర్శించారు. రెవిన్యూ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.