Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ బంక్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన
- డీసీసీ అద్యక్షుడు నాయిని
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ -న్యూ శాయంపేట
పేద ప్రజల నడ్డివిరిచే విధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిం చాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ నక్కలగుట్ట ఈ-సేవ ముందున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహి ళలు కట్టెలపై వంట చేస్తూ నిరసన కార్యక్ర మాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనో మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ అడ్డగోలుగా పెంచుతూ పేద ప్రజల నడ్డి విరు స్తున్నారన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గహవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72 డీజిల్ పై లీటరుకు 23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని లేనియెడల రానున్న ముందు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈవీ శ్రీనివాస్ రావు, టీపీసీసీ కార్యదర్శులు కొత్తపల్లి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్నీ లక్ష్మణ్, కార్పో రేటర్ లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ డాక్టర్ పెరుమాండ్ల రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండల కేంద్రం లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిరసన తెలిపారు. నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఖానాపురం మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పెట్రోల్ బంక్‌ల ఎదుట శుక్రవారం నిరసనా కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర, ప్రభుత్వం ఇష్టారీతిన పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
జనగామ : జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్లు ఎర్రమల సుధాకర్, వేముల సత్యనారాయణరెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదెపాక రాంచందర్, కౌన్సిలర్లు చంద్రకళ రాజు, చందర్, మల్లేశం, అంజనేయులు, కళ్యాణి మల్లారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టెవాడ తిరుపతి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, కిసాన్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు కంబాల రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి గుంటోజు శంకరయ్య, సర్పంచ్ రత్నం భద్రయ్య, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు దేవ్ సింగ్, మాజీ ఉప సర్పంచ్ ఎల్లావుల అశోక్, గండ్రత్ విజయాకర్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి అజ్జు, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని పెట్రోల్ బంకుల ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జయరాంరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అయ్యోరి యానయ్య, కొంకతి సాంబశివరావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కోడం బాలకష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి లావుడ్య శ్యాంలాల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయతుల్లా, సిద్ధాబత్తుల జగదీశ్వర్‌రావు, మాటూరి బాలు, మాసిరెడ్డి వెంకటరెడ్డి, తోట అశోక్‌కుమార్, తాలూక సంపత్, కొమరం బాలయ్య, పందిరి మోహన్, మైల మల్లికార్జున్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని పస్రా పెట్రోల్ పంప్ వద్ద సర్పంచ్ ముద్దబోయిన రాము ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపూత్ సీతారాం నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి, మాజీ మండల అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు తిరుపతి, జనార్ధన్‌రెడ్డి, చిట్టి బాబు, అశోక్, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి, పూర్ణ గంగు, సర్పంచ్‌లు భూక్య సుక్యా, మాధవరెడ్డి, ఉప సర్పంచ్‌లు లింగారెడ్డి, శేఖర్‌రెడ్డి, దేపాక కృష్ణ, సారయ్య, రాజు, గోపీ, తండా కృష్ణ, పాండ్య రాజు పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కత్తి స్వామి, సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ నాయక్, పీసీసీ మాజీ కార్యదర్శి నూనావత్ రాధ, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వేం శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు యాకుబ్ పాషా, మండల నాయకుడు అమరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ శివరాత్రి సంపత్, మండల నాయకులు బీరం శ్రీపాల్‌రెడ్డి, కన్నబోయిన వెంకన్న, పూజారి శంకర్, అర్రెం వీరస్వామి, రాసమల్ల యాకయ్య, శివ, కొమ్మాలు, సురేందర్, శ్రీను, సుందర్, శ్రీకాంత్, యూత్ సభ్యుడు రాము, తదితరులు పాల్గొన్నారు.
తాడుతో ఆటో లాగి నిరసన
చిన్నగూడూరు : మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వడ్లకొండ ఆదాం, కొత్త శేఖర్, బిక్కు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : స్థానిక పెట్రోల్ పంప్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బొలెరో వాహనాన్ని తాడుకట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గాదె మహేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం పాషా, ఎంపీటీసీలు పేరె ఉషా రవి, రచ్చ సోమనాథం, అల్లిబిల్లి కష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ మేడిపల్లి వెంకటేశ్వర్లు, మల్లేష్, బడితే వీరస్వామి, వెంకట్ నాయక్ పాల్గొన్నారు.
కన్నాయిగూడెం : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, జిల్లా నాయకుడు జాడి రాంబాబు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ మాట్లాడారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోట నాగేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కటకం మల్లన్న, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొగ్గుల సుధాకర్, నాయకులు సునారకాని ఎల్లయ్య, బొట భిక్షపతి, నవీన్, వాసం నరేందర్, మట్టి భాస్కర్, చంటి, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని హెచ్‌పీ పెట్రల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ నరకుటి గజానంద్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పస్తం కష్ణ, నూకల హరీష్ యాదవ్, బసవబోయిన రాజేష్, భూతం భరత్ కుమార్, రతన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం : మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహంచారు. ఈ సందర్బంగా ఎంపీపీ చెరుకూరి సతీష్, పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహన్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు కొండపర్తి సీతాదేవి, గారపాటి రవి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి నాగేశ్వరరావు, నాయకులు చిడెం శివ, రమేష్, కళాధర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : స్థానిక పెట్రోల్ బంక్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు కష్ణ గౌడ, గుగులోత్ శ్రీను, గంగ, చిలక బాబు, శ్రీను, శ్రీను, కష్ణ, పవన్ కళ్యాణ్, గిరి, రాహుల్, రామారావు, జవహర్ లాల్, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ, మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోగినేని సీతారామయ్య, మండల ఉపాధ్యక్షుడు తీగల వెంకటయ్య, సొసైటీ డైరెక్టర్ కేతమల్లు, నిరంజన్, మహేష్, కోడి శ్రీను, సందీప్ వెంకటేశ్వర్లు, మాడే బాబు, తదితరులు పాల్గొన్నారు.
బానోత్ మోహన్‌జీ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఎంపీటీసీ బానోత్ మోహన్‌జీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మోహన్‌జీ మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొవ్వూరి దామోదర్‌రెడ్డి, చాట్ల సంపత్, గంగావత్ రవి, భూక్యా పంతులు, వెంకటేశ్వర్లు, చిరంజీవి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.