Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
కరోనా బాధితులు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షష్ట్రడు ఈదురు ఐలయ్య కోరారు. ఆ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 120 మంది రెండో విడిత కరోనా బాధితులకు, జర్నలిస్టులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం డ్రై ఫ్రూట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. కరోనా బాధితులను కాపాడాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో అందరినీ సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి దయాకర్‌రావుకు, ట్రస్ట్ చైర్మెన్ ఉషకు మండల పార్టీ, ప్రజల పక్షాన కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మెన్ రామచంద్రయ్య శర్మ, మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు, మాజీ ఎఫ్ఏసీఎస్ వైస్ చైర్మెన్ ముత్తినేని శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షుడు కాసాని హరీష్, ఎర్రబెల్లి చారిటుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ఎర్రసాని రామ్మూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షులు విజరుపాల్రెడ్డి, లింగమూర్తి, కుమార్, హరీష్, సుంకరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.