Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్వాహణ
- తుప్పు పట్టిన మైక్రోస్కోప్‌తో పరీక్షలు..!
- మూడు ల్యాబ్‌లు సీజ్
- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-వెంకటాపురం
అర్హతలు లేకుండా ఆర్ఎంపీ వైద్యులకు అనుసంధానంగా ఉంటూ రక్త పరీక్షా కేంద్రాల నిర్వాహిస్తూ అమాయక ఏజెన్సీ జనాన్ని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో ఓ యువకుడు పెట్టిన పోస్ట్‌కు జిల్లా వైద్యాధికారి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రక్త పరీక్షా కేంద్రాలపై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు శనివారం రక్త పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 3 రక్త పరీక్షా కేంద్రాలను సీజ్ చేశారు. ఓ కేంద్రంలో తుప్పు పట్టిన మైక్రోస్కోప్‌తో రక్త పరీక్షలు నిర్వహిస్తుండడంతో సదరు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు మాట్లాడారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఆల్లెం అప్పయ్య ఆదేశాల మేరకు మండలంలోని రక్షా పరీక్షా కేంద్రాల్లో తనిఖీ నిర్వహించినట్టు తెలిపారు. కనీస అర్హతలు లేకుండా ఆర్ఎంపీ వైద్యులకు అనుసంధానంగా ఉంటూ రక్త పరీక్షలు నిర్వహిస్తున్న భారతీ, అమ్మ, భువనేశ్వరీ ల్యాబ్‌లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆర్ఎంపీ ఆస్పత్రుల్లోనూ తనిఖీలు చేసినట్టు చెప్పారు. పడకలు ఏర్పాటు చేసి కోవిడ్-19కు వైద్య చికిత్స అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్ఎంపీ వైద్యులు యాంటీ బయాటిక్ మందులు వినియోగించొద్దని స్పష్టం చేశారు. ఆర్ఎంపీలు ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన బోర్డుల్లో వారి పేర్ల ముందు డాక్టర్ అనే పదాన్ని తొల గించాలని చెప్పారు. అర్హులైన వైద్యాధికారులు సూచించిన మందుల చీటీలు ఉంటేనే మందుల దుకాణాల యజమానులు మందులు విక్రయించాలని తెలిపారు. తనిఖీలో స్థానిక వైద్యాధికారి సాయిక్రిష్ణ, సిబ్బంది రాఘవులు, గురుదేవ్, రాజేష్, పోలీసులు పాల్గొన్నారు.