Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్ఘడ్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ఫలితం గానే దేవాదాయ శాఖ భూముల రక్షణకు అధికారులు బోర్డ్ పాతి నట్టు ఆ పార్టీ మండల కార్య దర్శి రాపర్తి సోమయ్య తెలి పారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 192లోని 4 ఎక రాల భూమి ఆక్రమణంగా గురి కాగా 15 ఏండ్లుగా దాన్ని కాపాడేందుకు పోరాటాలు నిర ్వహిస్తున్నట్టు తెలిపారు. అక్రమంగా దొంగ పాసు బుక్కులు పొంది సదరు భూమిని కాజేయాలని కుట్ర చేయగా పార్టీ పోరాటంతో దేవాదాయ శాఖ ఈఓ వీరస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ శనివారం బోర్డ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడారు. ఇప్పటికైనా సదరు భూమిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసు కుని ప్రజలకు ఉపయోగ పడేలా వినియోగించా లని సూచించారు. విలువైన భూమిని కబ్జాదార్ల పాల్జేసిన, తప్పుడు పాసుబుక్కులు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సదరు భూమిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట నర్సయ్య, కాట సుధాకర్, జ్యోతి యాకయ్య, ఈరబత్తిని అంజయ్య, కోత్వాల కుమార్, అబ్దుల్, తాటికాయల రాజేందర్, ఎల్లయ్య, వెంకట్రామ్ నర్సయ్య, కాత కష్ణ, గుండెబోయిన రాజు, తదితరులు పాల్గొన్నారు.