Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
సూపర్ స్పైడర్స్ తప్పకుండా వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బల్దియా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. డాక్టర్ రాజారెడ్డితో వాక్సినేషన్, పారిశుద్ధ్యం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్య ఆరోగ్యాధికారి మేయర్‌కు వాక్సినేషన్ పురోగతిని వివరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ గత నెల 29 నుంచి నగరంలోని 9 వివిధ విభాగాలలోని సూపర్స్పైడర్లకు నగరవ్యాప్తంగా 8 కేంద్రాల్లో వాక్సినేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేటాయించిన కేంద్రాల్లో యుద్ధప్రతిపాదికన వాక్సినేషన్ కొనసాగుతున్నదని, నగరంలోని సూపర్ స్పైడర్స్ వాక్సినేషన్ లక్ష్యం 93 వేలు 35 కాగా లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటివరకు సుమారు 94 వేల 623 మందికి వాక్సినేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెల 15 వరకు ఈ ప్రత్యేక వాక్సినేషన్ శిబిరాలు కొనసాగుతాయని ఇంకా వాక్సినేషన్ పొందని సూపర్ స్పైడర్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో అనుసరిస్తున్న సానిటేషన్ పద్ధతులు, ఇంకా ఉత్తమమైన విధానాల అమలుకు తీసు కోవాల్సిన చర్యలపై ప్రధాన ఆరోగ్యాధికారికి తగు సూచనలు చేస్తూ సానిటేషన్ నిరం తరంగా కొనసాగాలని పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేయాలని సూచించారు.