Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటల రాజీనామా ఆమోదంతో అనివార్యమైన ఉప ఎన్నిక రాజకీయ పార్టీల సన్నద్ధం
హుజురాబాద్లో మోహరించిన మంత్రులు
నవతెలంగాణ-వరంగల్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం స్పీకర్ ఆమోదించడంతో రాజకీయ పార్టీలు హుజురాబాద్ ఉప ఎన్నికకు సన్నద్ధమవుతున్నాయి. ఈటల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈటలను బర్తరఫ్ చేసిన నాటి నుండే నియోజకవర్గంపై టీఆర్ఎస్ నాయకత్వం నిఘా పెట్టింది. ఈటలను ఒంటరి చేయడానికి మండలాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా పెట్టి ప్రజాప్రతినిధులు, నేతలంతా టిఆర్ఎస్లోనే కొన సాగేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా 'ఈటల' రాజీనామాకు ఆమోదం తెలుపడంతో టీఆర్ఎస్, ఈటలకు మధ్య ప్రత్యక్ష రాజకీయ యుద్ధం ప్రారంభం కానుంది. ఒకట్రెండు రోజుల్లో ఈటల బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అనంతరం నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.