Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలో బాలకార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని శాయంపేట రెడ్యూస్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఆర్డి ఎస్, మారి స్వచ్చంద సంస్థ సహకారంతో ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంల శనివారం మండలంలోని హుస్సేన్ పల్లి, తహ రాపూర్, పోచారం, నూర్జహన్ పల్లి, గంగిరెణీగూడెం గ్రామాలలో బాల కార్మికుల నిర్ములన వ్యతిరేక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గ్రామం లోని చైల్డ్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు సభ్యులు, రైతులతో బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం, బాలల భవితకు బంగారు బాట వేద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాలలో ర్యాలీ నిర్వహించి అవ గాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, చైల్డ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, రైతులు మరియు మారి సంస్థ సిబ్బంది అసిస్టెంట్ ప్రొడ్యూస్ యూనిట్ మేనేజర్ అక్కల రమేష్, దొడ్డిపాక రవిచందర్, బైకాని ప్రశాంత్, పల్నాటి రాంబాబు, పాక శ్రీనివాస్, మోటే మనోహర్ రావు, షేక్ గౌస్, షేక్ అనిఫా, బాసాని సాగరిక, భానుమతి పాల్గొన్నారు.