Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
ఉమ్మడి మండలాలలో పూర్తయిన రైతు వేదికల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం ధర్మసాగర్, వేలేరు మండలాలలో ఉన్న రైతు వేదికలను ఈ నెల 16వ ప్రారంభోత్సవ నిర్ణయ సమీక్షా సమావేశం ఎమ్మెల్యే స్వగహం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలాల ప్రజా ప్రతినిధులు వ్యవసాయ అధికారులు రైతు సమన్వయ సమితి సభ్యులతో రైతువేధికలను ప్రారంభోత్సవం చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వస్తున్నారని ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరవుతున్నట్ట తెలిపారు. మొదటగా ధర్మసాగర్ మండలంలోని రాయిగూడెం, పెద్దపెండ్యాల , ఎలుకుర్తి , ధర్మసాగర్ ,నారాయణగిరి , వేలేరు మండలంలోని పీచర , వేలేరులలో రైతు వేధికలు ప్రారం భోత్సవం చేసుకుంటూ చివరగా షోడాశాపల్లిలోని రైతు వేదిక ప్రారంభోత్సవం చేసిన అనంతరం రైతువేధిక సభను నిర్వహించాల న్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి, వేలేరు ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, ధర్మసాగర్ జెడ్పీటీసీ శ్రీమతి పిట్టల శ్రీలత ఏ డి ఏ దామోదర రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు.