Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్
నవతెలంగాణ-సుబేదారి
బాలల హక్కులను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సర్క్యూట్ గెస్ట్ హౌజ్లో జిల్లా బాల కార్మిక నిర్మూలన సంస్థ రూపొందించిన కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఆ సంస్థ రూపొ ందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ రూపు మాపేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నేడు మారు మూల గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లితండ్రులు వారి ఆర్థిక పరిస్థితి, నిరక్షరాస్యత ఇతరత్రా కారణాల దష్ట్యా వారి పిల్లలను పనిలో పెట్టడడం తద్వారా వారు కలలు కన్న బంగారు భవిష్యత్ అంధకారం కావడం విచారించదగ్గ విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. బాల బాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధి కారాన్ని రాజ్యాంగం 15 వ ప్రకరణం ప్రకారం రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని గుర్తు చేశారు. బాలల కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం చట్టాలను సవరించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మారు మూల గ్రామీణ కొన్ని పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత , పేదరికం కారణంగా మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలన పట్ల అవగాహన రాహిత్యంతో తమ పిల్లలను పనికి పంపిస్తున్నట్టు తెలిపారు. 14 సంవత్సరాలలోపు బాల బాలికలను పనిలో పెట్టుకొంటే జువెనైల్ జస్టిస్ ఆక్ట్ 2005 ప్రకారం శిక్షార్హులని,18 సంవత్సరాలలోపు బాలబాలికలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానిపై బాలకార్మిక నిషేధ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమైన నేరమన్నారు. సమగ్ర బాలల రక్షణ పరిరక్షణ కొరకు ప్రత్యేక భవన ఏర్పాటుకోసం అధికారులతో చర్చించి చర్యలు తీసుకుం టా నని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, సభ్యులు డాక్టర్ పరికు సుధాకర్, కాజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, ఎన్సీఎల్పీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బుర్ర అశోక్ పాల్గొన్నారు.