Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముక్కెర రామస్వామి విమ ర్శించారు. శనివారం ఆయన ఉర్సు గుట్ట లోని ఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ లేక అనేకమంది కరోనా పేషెంట్స్ చనిపోయిన పరిస్థితి నెలకొన్నదని మండి పడ్డారు. కరోనా బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయంగా నెలకు 10 కిలోల బియ్యం, 7500 రూపా యలు ఆరు నెలల పాటు సాయం చేయాలన్నారు. అలాగే ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్పించి పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ భవన్లో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల ఈ కేంద్రంలో కరోనా తో జాయిన్ అయి కోలుకొని స్వగహలకు వెళ్తున్న వారిని ఆయన పరా మర్శించారు. వారు ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి తమ బాగోగులు చూసుకున్నందుకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల రవి, ఉదరు కుమార్, జున్నోజు జయచందర్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.