Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
రైతు ఉత్పాదక సంఘాలచే రైతులు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా రు. పట్టణంలోని నెక్కొండ రోడ్డులో విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని ప్రారభిం చారు. విగేశ్వర ఫార్మర్ కంపెనీ కమిటీ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి అధ్యక్షత నిర్వహించిన ప్రారం భోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రార్మర్ ప్రొడ్యూస్ కంపెనీల ఏర్పాటుతో రైతులు తాము పండించిన పంట లను కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ చేసే స్థాయికి ఎదుగడానికి ప్రభుత్వం ప్రాధన్యనిస్తుందని తెలిపారు. నియోజవర్గంలో పెద్ద సంఖ్యలో సంఘాలను ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకొచ్చారన్నారు. ప్రభు త్వం సంఘాలకు రాయితీలను అందజేస్తుందని తెలిపారు. పలు సంఘాలు ఇప్పటికే సొంతగా పలు రైతు సేవ లందిస్తూ ఆర్థికంగా పరిపుష్టి సాధించే దిశలో పయని స్తున్నాయన్నారు. మిగతా రైతు సంఘాలన్నీ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రైతులు తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసు కోవాలన్నారు. పంటోత్పత్తులు కొనుగోలు గిట్టుబాటు ధర కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, వార్డు కౌన్సిలర్ రాయుడి కీర్తి రెడ్డి, ఏవో పీ.కృష్ణకుమార్, ఏఈవో మెండు అశోక్, రైతు సమన్వయ సమితి ప్రతిని ధులు రాయుడి రవీందర్ రెడ్డి, నామాల సత్యనారాయణ, మెతె జైపాల్ రెడ్డి, చిలుకూరి వెంక టేశ్వర్లు, చిలువేరు కొమ్మాలు, చిలువేరు కొమురయ్య, శివ కుమార్, కార్తీక్ కుమార్, బుర్ర మోహన్ రెడ్డి, రాధా రపు రాజయ్య, లింగాల సూరయ్య, కడారి కుమారస్వామి, గంగాడి రాజమల్లారెడ్డి, గంగాడి తిరుపతి రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల స్వామి, తౌటి వెంకటనారాయణ, అజ్మీర మంగ్యా. పుట్ట హనుమయ్య, ఈగ సత్యనారాయణ, లింగాల శంకర్, తోట అశోక్ పాల్గొన్నారు.