Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ ప్రజానీకం కోసమే డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు
- మందారిపేట నుంచి ప్రగతి సింగారం వరకు 8.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం
- వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
సీఎం కేసీఆర్ వైద్య, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేస్తున్నారని వరంగల్ రూరల్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల పరిధి గ్రామాలలోని లబ్ధిదారులకు మంజూరు అయిన 3 లక్షల 47 వేల సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం వరంగల్ రూరల్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఒకే చోట కాకుండా లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. రాజుపల్లి గ్రామంలో మాజీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబశివరాజు కరోనా పాజిటివ్ తో బాధపడుతూ చికిత్స పొందుతూ మతి చెందాడని తెలుసుకొని, కుటుంబ సభ్యులను సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వంం నుండి సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. 19 జిల్లాలలో ఒక్కో జిల్లాలో రెండున్నర కోట్లతో డయాగస్టిక్ సెంటర్ లు ఏర్పాటు చేసి, సాధారణ ప్రజలకు యాభై ఏడు రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వ్యవసాయ పంట సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. రైతులు పండించిన క్వాలిటీ పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. శాయంపేట మండలంలో రెండున్నర లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కరోనా ఎఫెక్ట్ తో అభివద్ధి పనులు నిలిచిపోయాయని, మందారి పేట నుండి ప్రగతి సిం గారం వరకు ఎనిమిదిన్నర కోట్ల తో డబల్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయని, అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తికాగానే అతి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతు కు తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుసుమ శరత్, సర్పంచ్ కందగట్ల రవి, మత్స్యగిరిస్వామి చైర్మెన్ సామల బిక్షపతి పాల్గొన్నారు.