Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియాలో సుమారు 810 మందికి వ్యాక్సిన్
నవతెలంగాణ-కోల్ బెల్ట్
భూపాలపల్లి ఏరియాలో ఆదివారం సింగరేణి కార్మికుల సంక్షేమార్థం సింగరేణి సిఅండ్ ఎండీ ఎన్. శ్రీధర్ ఆదేశాల మేరకు మెగా కోవిడ్ వ్యాక్సిన్ శిభిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ టి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమాన్ని దష్టిలో పెట్టుకొని కోవిడ్ ఉదతిని అరికట్టుటకు మెగా వ్యాక్సిన్ శిబిరాన్ని నిర్వహించడానికి గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగులంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని కోవిడ్ బారిన పడకుండా తమ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా, సహ ఉద్యోగులకు కూడా ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఏరియాలో 8 ఇంక్లైన్ 1000 క్వార్టర్లు, కష్ణా కాలనీ డిస్పెన్సరీ, సింగరేణి పాఠశాల, సుభాష్ కాలనీ కమ్యూనిటీ హాల్, మిలీనియం క్వార్టర్స్ డిస్పెన్సరీ లో సాయంత్రం ఐదు గంటల వరకు 807 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజీఎం విజయ ప్రసాద్, రామలింగం ఏజీఎం (ఈఅండ్ఎం), సత్యనారాయణ డీజీఎం (సివిల్), టీబీజీకేఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.