Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పందించని బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగరంలోని శిథిలావస్థలో ఉన్న గహాలను గుర్తించి తొలగించుటకు బల్దియా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యదోరిణి వ్యవహ రిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి జక్కలొద్దిలోని ఒక గహం శిథిలావస్థకు చేరి కూలి పోయే స్థితిలో ఉన్నదనే విషయాన్ని కమిషనర్ దష్టికి తీసుకెళ్తే బల్దియా కమిషనర్ ఓ రెవిన్యూ అధికారిని పంపించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇలా శిథిలా వస్థలో ఉన్న గహాల సంఖ్య నగరం లో చాలా ఉన్నాయి. వాటిపై ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురాతన గహాలు కూల్చి వేయడంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు జాప్యం చేస్తున్నారు. పురాతన మైన పెద్ద భవనాలు సైతం శిథిలావస్థలో ఉన్నాయి. వారికి భవన యజ మానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు, కానీ కడు పేదరికంలో ఉన్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎవరు చేస్తారని ప్రజలు వాపోతున్నారు. గతంలో మహా నగర పాలక సంస్థ పరిధిలో 390 శిథిలావస్థలో ఉన్న గహాలను తొలగించారు. కాని ఈ సంవత్సరం మాత్రం పురాతన గహాలను తొలగించడంలో ఎలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టక పోవడం గమనార్హం. మహా నగరంలోని 42 విలీన గ్రామాలలో ఎక్కువ పాత ఇండ్లు ఉంటాయి. వారికి ప్రత్యామ్నాయ ఏర్పా ట్లుచేసి పురాతనమైన ఇండ్లను కూల్చి ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరు చేయాలి. శిథిలావస్థలో ఉన్న గహాల తొలగించడంలో అధికారులు ఇంకా జాప్యం చేస్తే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ,అధికారులు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పురాతనమైన ఇండ్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలోనే పురాతన గహాలను తొలగిస్తాం
-వెంకన్న, పట్టణ ప్రణాళిక అధికారి
వర్షాకాలం దష్ట్యా పురాతమైన గహాలను గుర్తించిన వెంటనే తొల గించాలని ఆదేశాలు జారీ చేశాం. పురాతన గహాలను తొలగి ంచడంలో పట్టణ ప్రణాళికాధికారులు. ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసు కోవాలని అధికారులకు చెప్పాం. ఇప్పటికీ 45 శిథిలావస్థలో ఉన్న గహాల ను గుర్తించాము వారికి నోటీసులు జారీచేసి త్వరలోనే తొలగిస్తాం.