Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన పలువురు బాధిత కుటుంబాలను ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పస్రా గ్రామానికి చెందిన భూధాటి సందీప్, మండల కేంద్రానికి చెందిన కొమ్మరాజు అప్పారావు ఇటీవల మృతిచెందారు. కాగా బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.
తాడ్వాయి : మండలం లోని జలగలంచ గ్రామంలో హన్మకొండకు చెందిన ఈఫ్కో టోకీయో జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో 60మంది పేద కుటుంబాలకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరుకుల్ని ఆదివారం ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో పేదల ఆకలితీర్చేందుకు ముందుకొచ్చిన దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలన్నారు.