Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
విదుద్ఘాతంతో రైతు మతిచెందిన సంఘటన మండలంలోని హరిజన కాలనీ పంచాయితీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హరిజన కాలనీకి చెందిన కడారి మల్లయ్య(55) తన వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఇటీవల కురిసిన వర్షాలతో పాటు వీచిన గాలులకు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు మల్లయ్యకు తగిలి మతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు మతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న తెలిపారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు నేలకు తాకేలా వేలాడుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాన్స్కో ఉన్నతాధి కారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.