Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్
నవతెలంగాణ-వెంకటాపూర్
రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం కషి చేస్తోందని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నిర్లక్ష్యం మూలంగానే సెకండ్ వేవ్ ఉద్రిక్తంగా మారిందన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హౌమ్ ఐసోలేషన్, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో మెడికల్ కిట్లు వాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారం తర్వాత వైరస్ అదుపులోకి రాకపోతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. కరోనా వైరస్ పట్ల భయాందోళన చెందొద్దన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. మండలంలోని ఆరు సబ్ సెంటర్లకు నూతన భవనాలు నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి నిధుల మంజూరుకు కషి చేస్తానన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 లక్షలతో సీసీ రోడ్డుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ములుగు జిల్లాను అన్ని విధాలుగా అభివద్ధి చేసేందుకు కషి చేస్తున్నట్టు తెలిపారు.