Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-పాలకుర్తి
కరోనా కాటుకు మండలంలోని తొర్రూరు గ్రామానికి చెందిన మహమ్మద్ చాంద్ భాష ఐదు రోజుల క్రితం మతి చెందాడు. దీంతో మతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు తోటి మిత్రులు అండగా నిలిచారు. పాలకుర్తి ఉన్నత పాఠశాలలో 1994-95బ్యాచ్‌కు చెందిన తోటి పదోతరగతి స్నేహితులు ఆదివారం మతుని కుటుంబ సభ్యులకు బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.లక్ష చెక్కును అందజేశారు. మూడు నెలలకు సరిపడా నిత్యా వసర సరుకులను అందించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాపాక నాగరాజు, తాడూరు రమేష్, జమాలుద్దీన్, సత్యనారాయణ సోము, వెంకట్‌రెడ్డి, సందీప్, భగవంతు, పుష్ప, ఉపేంద్ర మంజుల, సంపత్, గోవర్ధన్, భీమ పాల్గొన్నారు.