Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు మంత్రుల పర్యటనలు
- మరోవైపు రాజీనామాలు
నవతెలంగాణ-వరంగల్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియో జకవర్గం హుజురాబాద్‌లో ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమా వేశాలు జరుపుతుండగానే వీణవంక మండ లంలోని 13 మంది ఉపసర్పంచ్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. హుజురాబాద్ నియోజ కవర్గకేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్, వీణవంక మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తోపాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావులు, ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జమ్మికుంట మండలంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ సమావేశాలు నిర్వహి స్తుండగానే వీణవంక మండలానికి చెందిన 13 గ్రామాల ఉప సర్పంచ్‌లు టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈట లను అణిచివేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నామని, ఈటల నాయకత్వంలోనే పనిచేస్తామని ప్రకటించారు. 'ఈటల' మా నాయకుడని, ఆయన బాటలోనే నడుస్తామని మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో నియోజ కవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణలు అనుక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్‌లో ఆయన్ను ఓడించడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆ నియోజ కవర్గంలోని వీణవంక మండలం ఉప సర్పంచ్‌లు గట్టి షాక్‌నిచ్చారు. హుజు రాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్, ఇల్లంతకుంటలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వీణవంక మండలంలో
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నార దాసు లక్ష్మణ్‌రావులు కార్యకర్తలతో సమా వేశంలో వుండగానే వీణవంక మం డలానికి చెందిన 14 గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్‌లు టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ఈటల'ను అణచివేయడానికే బర్తరఫ్ చేశారని, ఆరోపిస్తూ 'ఈటల'కు మద్దతుగానే కొనసాగుతామని, ఆయనే మా నాయ కుడని మండల ఉపసర్పంచ్‌ల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రకటించారు. నియోజ కవర్గంలో మంత్రులు, ఎమ్మెల్సీలు పర్యటిస్తున్న తరుణంలో ఈ రాజీనామాలు టిఆర్ఎస్కు గట్టి షాక్‌నిచ్చాయి. ఈ వార్త నియో జకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంపై నిఘా పెట్టింది. 'ఈటల'కు మద్దతుగా వుంటున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టిఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఎవరూ 'ఈటల' వెంట వెళ్లకుండా మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యేలను రంగంలోకి దించి దారికి తెచ్చుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత అణిచివేయాలని చూస్తుందో అంత మేరకు ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. టీఆర్ఎస్ పార్టీ కేడర్‌లో 'ఈటల'కు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు ఇంటికి వెళ్లి టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించిన కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు పలువురు మళ్లీ శామీర్‌పేటకు వెళ్లి ఈటలకు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో రాజ కీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఏ క్షణంలో ఏ నేత ఎటువైపు వెళ్తాడో, తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తన అనుచరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, నియోజకవర్గంలో రూ.50 కోట్లు ఖర్చు చేశారని 'ఈటల' ఆరోపించారు. ఈ నేపథ్యంలో 'ఈటల'ను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు కొన్ని విఫలమవడం టిఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపరుస్తుంది.
ఈటలకు పలు సంఘాల మద్దతు..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలు సంఘాలు, కుల సంఘాలతో చర్చలు జరపడం ఇప్పుడు ఆయనకు అనుకూలాంశంగా మారింది. తాజాగా ఓయూలోని బీసీ విద్యార్థి సంఘాలు ఈటలకు బాసటగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగు తుంది. ఇదే పరిస్థితి కాకతీయ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవి ద్యాలయంలోనూ ఉత్పన్నమైతే అధికార టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. బర్తరఫ్ అయిన నాటి నుంచే ఈటలకు మద్దతు పెరగడం వెనుక సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వ్యతిరేకించేవారు అధికంగా వుండడమేనని ప్రచారం జరుగుతుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని వ్యతిరేకించేవారంతా 'ఈటల'కు మద్దతుగా రంగప్రవేశం చేస్తే వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా నియోజకవర్గంలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. 14న ఈటల బీజేపీలో చేరి వచ్చాక రాజకీయాలు టీఆర్ఎస్, బీజేపీిల మధ్య మరింత వేడెక్కనున్నాయి.