Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభమైన ఖరీఫ్ పనులు
- బిజీబిజీ అవుతున్న రైతన్నలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 2 లక్షల 38, వేల 800 ఎకరాలు సాగు అంచనా..
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గతేడాది కాస్త వర్షాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురుస్తుం డడంతో జిల్లాలో రైతులకు ఊరట కలిగింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నన్నాయి ఇప్పటికే వ్యవసాయ భూముల్లో రైతులు అచ్చు తోలుతూ పత్తి విత్తనాలు విత్తుతున్నారు. చెరువులు కుంటలో సైతం నీరు ఉండడంతో రైతులకు భరోసాతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది పంట విస్తీర్ణం స్వల్ప ంగా పెరిగిందనే అధికారులు చెబుతున్నారు. 2020లో రెండు లక్షల 27 వేలు సాగుకు అంచనా వేయగా ఈ వర్షాకాలం రెండు లక్షల 32 వేల ఎనిమిది వందల ఎకరాలకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత వానాకాలం కంటే ఈ ఏడాది పదకొండు వేల 707 ఎకరాల్లో స్వల్పంగా విస్తీర్ణం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాల్లో వరి 96 వేల ఎనిమిది వందలు ఎకరాలు, కంది 2000, పెసర 2000 వేరుశనగ 800 పత్తి 1 లక్ష 35 వేలు మొక్కజొన్న 2200 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు
పలకరించిన నైరుతి..
నైరుతి రుతుపవనాల ప్రభావం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్త ంగా కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో బలపడిన రుతుపవనాల వల్ల శని వారం, ఆదివారం భారీ వర్షాల కురవడంతో మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు పంట పొలాల్లో నిమగమై దుక్కులు చదును చేస్తూ పత్తి విత్తనాలు విత్తడంతో పాటు సాగుకు సమాయత్తమవుతున్నారు.
రైతులకు అన్ని అందుబాటులో..
జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ అధికారులు భరోసా ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 306 విత్తన ఎరువుల దుకాణాలున్నాయి. వీటిలో ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచారు. 2800, టన్నుల యూరియా 1275,టన్నులడి ఏ పి, 1900 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి. అలాగే 80 వేల ప్యాకె ట్లుండగా , మరో వారం రోజుల్లో 80 వేల ప్యాకెట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు .25 వేల,వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
ముందస్తు సాగుకు అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటాలలో ఇప్పటికే సమద్ధిగా నీరు చేరుకుంది. వానాకాలం పంటలకు ముందస్తుగా సాగు చేపట్టేలా అవ గాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విత్తనాలు కొనుగోలు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. అయితే అనుమతుల్లేని విత్తనాలు పురుగు మందుల సమాచారం ఇవ్వాలి. ఖరీఫ్ సాగుకు రైతులు ఇప్పటికే పనులు మొదలు పెట్టడం అభినందనీయం. నారుమడి పోసుకోవడంతో పాటు పత్తి విత ్తనాలను విత్తుకోవాలి. తేలికపాటి నేలల్లో పత్తి, కందులు, మొక్కజొన్న వేసుకుంటే మేలు. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు అధిక లాభాలు పొందాలి..
- విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి
జీలుగ తో భూసారం పెంపు..
జీలుగతో భూసారం తెలుసుకోవచ్చు. ఇప్పటికే రైతులు జీలుగు పెంపుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడులకు తగ్గ దిగుబడులు రాక మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని రైతులు జీలుగా చోట్ల సాగు తో ఖర్చులను తగ్గించుకుంటున్నారు. జీలుగా సాగుతో భూసారాన్ని తెలుసుకోవడమే కాకుండా మెరుగైన దిగుబడులు పొందుతున్నారు. ఏరువాక కేంద్రం కషితో కేటగిరీలుగా పెరుగుతోంది వాన కాలంలో యాసంగి లో సీజన్లో భూమిలో సాగు చేసి కలియ చేసి భూసారం పెంచుకుంటున్నారు. విత్తనాలను పొలంలో వేసుకొని పోవడం వల్ల భూసారం పెరగడం వల్ల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటున్నారు.
- మాలోత్ సతీష్ కుమార్, భూపాలపల్లి మండల వ్యవసాయ అధికారి