Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్ పర్సన్ ముందు మోకరిల్లిన రైతు
- న్యాయం చేస్తానని హామీ
నవతెలంగాణ-శాయంపేట
తన తండ్రి యాభై ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి వంశ పారంపర్యంగా తనకు ఇవ్వగా సాగు చేసు కుంటున్నామని, నాలుగు నెలల నుండి ప్రక్క రైతు అరికిళ్ళ వీరయ్య అతని బంధువులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారితో ప్రాణభయం ఉందని తన భూమి తనకు ఇప్పించాలని రైతు అరికిళ్ళ సుధాకర్ సోమవారం మండల కేంద్రంలోని ఎం పీడీఓ కార్యాలయానికి వచ్చిన వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ముందు మోకరిల్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో రైతు సుధాకర్‌ను ఛాంబర్ లోకి తీసుకెళ్ళి మాట్లాడారు. తమది మైలారం గ్రామమని, తన తండ్రి అరికిళ్ళ చంద్రయ్య గత యాభై ఏళ్ల క్రితం 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పట్టా చేసుకుని కాస్తు లో ఉంటు న్నాడని తెలిపారు. సర్వేనెంబర్ 630/ సి/1, 630/ డి లో 1.5 ఎకరం భూమి ఉండగా భూమిలో బుర్ర మల్లయ్యతో కలిసి వ్యవసాయ బావి తప్పుకొని పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆ తదనంతరం తమ భూమిలో నుండి ఎస్ఆర్ఎస్పీ కాల్వ వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త పట్టా పాస్ పుస్తకంలో అధికారులు కేవలం ఎకరం భూమి ఉన్నట్లు రికార్డులు నమోదు చేసినట్లు తెలిపారు. తన భూమి పక్కనున్న వీరయ్య అతని కుటుంబ సభ్యులు గతంలో పెద్దమనుషులు పాతిన హద్దు రాళ్లను తీసివేసి, తన భూమిలోనే పాతడమే కాక బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. భూమి సర్వే చేయడానికి మీ సేవలో దరఖాస్తును గత మూడు నెలల క్రితం పెట్టినప్పటికీ, ఇప్పటికే అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్క రైతు దరఖాస్తు చేసిన మరుసటి రోజే అధికారులు మామూళ్ల మత్తులో పడి మరుసటి రోజే భూమి వద్దకు వచ్చారని ఇటీవల పత్తి గింజలు నాటడానికి వెళ్తే కొట్టి చంపుతామని బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు. రైతుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు నెలల నుంచి తనను ఇబ్బం దులకు గురి చేస్తున్నారని నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయాలని రైతు సుధాకర్ జెడ్పి చైర్ పర్సన్ కాళ్ల మీద పడి వేడుకున్నారు. దీంతో స్పందించిన జెడ్పీ చైర్ పర్సన్ న్యాయం చేస్తానని రైతుకు భరోసా ఇచ్చారు.