Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న అధికారులు
- చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని కల్లెడ గ్రామ శివారులో ఆవుకుంట తండా కుంటాలో అధికారుల అనుమతి లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరిపి వందల సంఖ్యలో ట్రాక్టర్ల ధ్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు రూ.లు 600వందలుగా ధర నిర్ణయించి నిర్వాహకులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇట్టి తతంగం అధికారులకు కనబడుతున్న తమకేమీ కానరానట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా విష యంలో కూడా అధికారులు చేతివాటం పెద్ద మొత్తంలో జరుగుతోందని, స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మేలుగుతూ వత్తాసు పలుకు తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అవినీతి కి ఆజ్యం పోస్తున్న సంబంధిత అధికారులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలను ప్రోత్సాహిస్తున్న అధికారులపై వేటు వేసి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.