Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాళం ఇచ్చిన రూ.75వేలు ఎక్కడ ?
- వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్
నవతెలంగాణ-వేలేరు
మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో పరిశుభ్రత కరవైందని వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ అన్నారు. ఐసోలేషన్ సెంటర్లో కరోనా బాధితులకు పండ్లు పంచడం కోసం సోమవారం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు, వేలేరు ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ వెళ్లారు. దీంతో అక్కడ పరిశుభ్రత విషయంలో అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసోలేషన్ సెంటర్లో పరిశుభ్రత విషయాన్ని పట్టించు కోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిచడం సరి కాదన్నారు. మండల ఎంపీపీ ఐసోలేషన్ ప్రారం భించినప్పుడు భోజన ఖర్చులు భరిస్తానని ప్రకటించడం జరిగిందని, వైద్యం కోసం వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని, స్కావెంజర్ ని నియమించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇటీవల అక్రమ మొరం రవాణా దందాలో టిప్పర్ లకు సంబంధించిన వ్యక్తి గొల్లెన రాజు స్వయంగా 75 వేల విరాళాన్ని తహసీల్దార్‌కు ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు అందించిన సమాచారం ఉందని అట్టి విరాళంతో కనీసం పారిశుద్ధ్య కార్మికులను నియమించడంలో కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఐసోలేషన్ సెంటర్ల పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెం బర్ బైరి అనిల్, అత్తెన రాజేందర్, లీగల్ అడ్వైజర్ కోడూరి రవి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీమ్ మాలిక్, యూత్ నాయకులు నవీద్, రఫీ, అజీజ్, ప్రవీణ్ పాల్గొన్నారు.