Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి
నవతెలంగాణ-నర్సంపేట
విప్లవ వీరుడు చేగువేరా అందించిన స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అన్నారు. సోమవారం సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో చేగువేరా 93వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా కుమారస్వామి మాట్లాడారు అస్తమా వ్యాధి ఉన్న కూడా తన ప్రాణాలను పక్కనపెట్టి సామ్రాజ్యవాద దేశాలను గడగ డలాడించిన విప్లవ యోధుడు చేగువేరా అని కొని యాడారు. చిక్కని చీకటికి రేపటిని చూపించే వెలుగుల రోజు కాదు, మానవాళి విముక్తికి విప్లవాత్మక మెడిసిన్ కావాలని కదంతొక్కిన గెరిల్లా విప్లవ యోధుడని తెలిపారు. ప్రపంచంలో దోపిడీ వ్యవస్థ పోవాలి అని సమసమాజం కోసం పరితపించి ప్రపంచ మానవాళికి సోషలిజమే పరిష్కారం అని చూపిన వ్యక్తి చేగువేరా అన్నారు. లాటిన్ అమెరికా దేశాలు మొత్తం చేగువేరా తిరిగి దోపిడీ వ్యవస్థను అంత మోందిచడం లో ముఖ్య పాత్ర పోషించాన్నారు. చేగువేరా సింబల్‌ను చెప్పులపై ముద్రించిన కార్పొరేట్ శక్తులు వ్యాపారపరంగా ఉపయో గించుకోవడం దుర్మార్గ మని విమర్శించారు. దేశంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ముకాస్తూ కరోనా మహామ్మారి నుంచి ప్రజలను కాపడడంలో ఆదమర్చాడని దుయ్యపట్టరు. మోడీ ప్రభుత్వ విధానాలపై చేగువేరా చూపిన మార్గంలో పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అనం తగిరి రవి, పట్టణ నాయకులు గుజు ్జల వెంకన్న, గడ్డమీది బాలకష్ణ, గుజ్జుల ఉమా, ఎడ్ల శివకుమార్, సింగారపు బాబు, నాగమణి, రజిని, విజయ, స్వర్ణ, మధు, రాజశేఖర్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ: వరంగల్ అండర్ బ్రిడ్జి ఓంకార్ భవన్లో చేగువేరా 93వ జయంతి సందర్భంగా ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున జిల్లా కో కన్వీనర్ గోరంటల శరత్ బాబు, ,ఏఐకెఎఫ్ జిల్లా కో కన్వీనర్ ఐతం నగేష్, రవి, లక్ష్మీ పాల్గొన్నారు.
భూపాలపల్లి: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కొమురయ్య భవన్లో చేగువేరా 93వ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోత్కు ప్రవీణ్ నాయకులు మెట్టు అనిల్ కిరణ్, నేరెళ్ళ జోసప్, మెరె సాయి కష్ణ, అలీమ్ పాషా, అజరు పాల్గొన్నారు.
పరకాల: పట్టణంలోని స్థానిక అమరవీరుల మైదానంలో చేగువేరా 93వ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మంద శ్రీకాంత్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.