Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపరాల సాగు పై దష్టి సారించాలి
- వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట మండలంలోని ఫర్టిలైజర్ డీలర్లకు మంచి పేరు ఉందని, కల్తీ విత్తనాల జోలికి వెళ్లవద్దని వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల య ఐకేపీ సమావేశ మందిరంలో వ్యవసాయ అది óకారులు, విత్తనాల డీలర్లు, సర్పంచులు, ఎంప ీటీసీలకు అవగాహన సమావేశం సోమవారం ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరుగగా ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు జరగవలసిన సమావేశం 11 గంటలకు ప్రారంభం కాగా సర్పంచులు, ఎంపీటీసీలు ఫర్టిలైజర్ డీలర్లు హాజరుకాకపోవడంతో ఏవో గంగా జమునపై జెడ్పీ చైర్పర్సన్ అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ సమాచారం అందించి సమావేశానికి హాజరయ్యే చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి, పత్తి, మిర్చి పంటల సాగే కాకుండా అపరాల పంటల పై దష్టి సారిం చాలన్నారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరగడమే కాక అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. రైతు వేదికలలో రైతులతో సమా వేశాలు ఏర్పాటు చేసి పంట సాగు పై అవగాహన కల్పించాలని సూచించారు. పంట క్షేత్రాలలో గడ్డి, పత్తి మొక్కలను కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, భూమిలో ఉన్న సూక్ష్మ క్రిములు చని పోయి రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. గ్రామ సర్పంచులు దష్టిసారించి భూములలో పంట తగలబెట్టే రైతులకు జరిమానాలు విధించాలన్నారు. యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నా యని తెలిపారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, వ్యవసాయ అధికారులు కూడా జీలుగ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. పరకాల ఏసీపీ శ్రీనివాస్ మాటా ్లడుతూ రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను లైసెన్స్ పొందిన అధికత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన వాటికి డీలర్ల సంతకం ఉన్న రసీదు తప్పనిసరిగా తీసు కోవాలన్నారు. గుంటూరు నుండి తెచ్చుకునే బయో సీడ్స్ రైతులు తెచ్చుకొని వాడుకోవాలి తప్ప, మిగతా రైతులకు అమ్మవద్దని, అమ్మినట్లయితే చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కొప్పుల గ్రామంలోని నీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశి ంచారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుసుమ శరత్, సర్పంచ్ కందగట్ల రవి, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.