Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
గొల్ల కురుమల సంక్షేమానికి సబ్సిడీ ద్వారా ఒక్కో కాపరికి ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించి ఆర్థికంగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొదటి విడత సంపూర్తికాక ముందే, రెండో విడత గొర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రెండో విడతపై ఆశలు పెట్టుకున్న కాపరులు అప్పులు చేసి, సంబంధిత పశుసంవర్ధక శాఖ వారికి డీడీలు అప్పజెప్పారు. మూడేండ్లకు పైగా అసలుకు వడ్డీ చెల్లిస్తున్నారే తప్ప గొర్లు పంపిణీ చేయలేదు. గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం ఆధ్వర్యంలో పలు దశల్లో ఆందోళనలు నిర్వహించగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ముందు పంపిణీ మొదలు పెట్టినా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. నేటికీ ఐదేండ్లు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని దుస్థితి నెలకొంది. ఇందుకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గమే నిదర్శనం.
జనగామ జిల్లాలో నేటి వరకు మొత్తం 193 గొర్రెల పెంపకం దారుల సొసైటీలు ఉంన్నాయి. ఇందులో 24,223మంది సభ్యులు ఉన్నారు. 2017లో మొదలు పెట్టిన గొర్ల పంపిణీ మొదటి విడతలో 10750మంది కాపరులు దరఖాస్తులు చేసుకోగా 10520మందికి అందజేశారు. మిగిలిన 230మందికి నిరాశే మిగిలింది. రెండో విడత లో 10650 మంది కాపరులకు గాను ఎన్నికల ముందు 2130 యూనిట్లు, అనంతరం 964 యూనిట్లు పంపిణీ చేశారు. మిగిలిన 7556 లబ్ధిదారులకు ఐదేండ్లు కావస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో డీడీ చెల్లించిన రూ.31250లకు ప్రతీ రూపాయికి వడ్డీలు చెల్లించకలేక గొల్ల కురుమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పంపిణీ చేసిన వాటిలోనూ అవకతవకలు జరగాయిన పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో యూనిట్ కు ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఇవ్వాలనే పథకం పక్కదారి పట్టిం కే వలం 6నుంచి 10 గొర్రెలు పంపిణీ చేస్తామని లేదంటే మొత్తమే లేవంటూ కావలనుకున్న వారికి భేషరతుగా సంతకాల సేకరణ తో మరీ పంపిణీ చేశారు. దీంతో కొందరు అమాయక లబ్ధిదారులు మోసపోయిన పరిస్థితి.
ఇచ్చిన హామీలు నీటి మూటలేనా ?
రాష్ట్రంలోని గొల్ల, కురుమల ఆఖరి కుటుంబం వరకు గొర్రెలు పంపిణీ చేస్తామని, వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తామని, చనిపోయిన గొర్రెకు బదులు మరో గొర్రెను కొనుగోలు చేసి అందిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని గొర్ల కాపరులు వాపోతున్నారు. గొల్ల, కురుమల అభివృద్ధికి గొర్రెల పంపిణీ కోసం రూ.4,579 కోట్లు రూపాయలను ఖర్చు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. రెండో విడతలో భాగంగా గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది జనవరి16న పంపిణీ చేస్తున్నట్లు లాంఛనంగా ప్రారంభించినా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు గొర్లు పంపిణీ చేయని పరిస్థితి. ఇప్పటికైనా గొర్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.