Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
స్దానిక సంస్థలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివద్ధికి ప్రజలు తోడ్పాటందించాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహాన్, సర్పంచ్ రత్నావత్ శంకర్ అన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.3లక్షలతో మండల పరిధి బాలాజీతండా పంచాయతీ నగరం గ్రామంలో సీసీ రోడ్లకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రజలకు అన్ని సౌకర్యాలను సమకూర్చుతున్నారన్నారు. పల్లె ప్రకతి వనం, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు తదితరవి ఏర్పాటు చేఇ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నారని అన్నారు. అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తేవాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొవిడ్ బాధిత యువకుడు బాలకష్ణను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్నాయక్, సొసైటీ చైర్మెన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్, శేరిపురం సర్పంచ్ డి సక్రు, ఎంపీటీసీలు భట్టు నాగరాజు, ఎస్ రమేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పానుగంటి రాధాకష్ణ, ఎంపీడీఓ రవీందర్రావు, పంచా యతీరాజ్ ఏఈ కిషోర్, ఎంపీఓ కిషోర్ కుమార్,కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు, మండల నాయకులు పాల్గొన్నారు.