Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధి కూలీల ధర్నా
నవతెలంగాణ-జనగామ
ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే ఎస్సీ, ఎస్టీ కూలీల పట్ల వివక్ష చూపిస్తూ కూలీ డబ్బులు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీిఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుక బడిన వీరికి ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సింది పోయి చేసిన పనికి వేతనాలు ఇవ్వక పోవడమేంటని ప్రశ్నించారు. తక్షణమే వీరి కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వేలాది మంది దళిత కూలీలకు జరగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు దళిత , గిరిజన సంఘాలు కదలి రావాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికా రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు తూడి దేవదానం, వ్యకాసా జిల్లా ఉపాధ్యక్షుడు పోత్కనూరి ఉపేందర్, నాయకులు పల్లేర్ల లలిత, ఎండీ అజారుద్దీన్, మరబోయిన మల్లయ్య, విష్ణు పాల్గొన్నారు.