Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బస్సు డిపో ఏర్పాటు చేయాలని గిరిజన యూని వర్సిటీని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ ముంజల భిక్షపతిగౌడ్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ములుగు ఏజెన్సీ ప్రాంతం వైద్య, విద్య రంగంలో వెనుకబడి ఉందని, మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల, బస్సు డిపో, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబరాజు, కర్ణాకర్, గుండె మీద వెంకటేశ్వర్లు, మాదారి భద్రయ్య, గుండాల నరసయ్య, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.