Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్
నవతెలంగాణ-ములుగు
సామ్రాజ్యవాద విధానాలపై పోరాడడమే చేగువేరాకు నిజమైన నివాళని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ తెలిపారు. సోమవారం వరల్డ్ యూత్ ఐకాన్ ఎర్నెస్టో చేగువేరా 93వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించి ఆయన మాట్లాడారు. చేగువేరా వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ ప్రజలను మానసికంగా చైతన్యం చేసే చికిత్స అధ్యయనానికి లాటిన్ అమెరికా వ్యాప్తంగా చేగువేరా మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించినట్టు గుర్తు చేశారు. సామ్రాజ్యవాదం విధానాలాను పారదోలేందుకు మెక్సికో క్యూబాలో పోరాటాలు ప్రారంభించారన్నారు. మార్క్సిజం మార్గంలోనే పోరాటాలు విజయ వంతమవుతాయని ఆయా దేశాల్లో విప్లవాలను జయప్రదం చేసి చూపించాడని అన్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోతో విప్లవానికి నాయకత్వం వహించి సామ్రాజ్యవాద పాలనను తుదముట్టిం చడంలో కీలక పాత్ర పోషించాడనానరు. ప్రభుత్వాల ద్వంద నీతిని గుర్తించి చేగువేరా స్ఫూర్తిగా యువత ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రవీణ్, రవీందర్, చంటి, తెలంగాణ రైతు కూలి సంఘం డివిజన్ నాయకులు బానోతు నరసింగం, బిక్షపతి, యాకయ్య, సూరయ్య పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో
జనగామ : సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవ వీర కిశోరం చేగువేరా 93వ జయంతి పురస్కరించుకొని చేగువేరా చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాజం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కనకారెడ్డి మాట్లాడుతూ చే గువేరా జీవితం పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. నేటి తరం యువత చేగువేరాను తమ హదయంలో పెట్టుకొని సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల శేఖర్, నాయకులు జోగు ప్రకాష్, కళ్యాణి పాల్గొన్నారు.