Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం మేరకు ఈనెల 16 నుండి పాఠశాలలు ప్రారంభ మవుతాయని, కాబట్టి ములుగు జిల్లాలోని సమస్త యాజమాన్యాల ప్రధానో పాధ్యాయులు, ప్రిన్సిపాల్ లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు జులై 01 నుండి ఆన్లైన్లో తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామం లోని విద్యార్థుల సమాచారం సేకరించాలని గ్రామ విద్యా నమోదు పుస్తకం (విఈర్ )ను నవీకరించాలని సూచించారు. ఆన్లైన్ పాఠాలు వినడానికి ఎంత మంది విద్యార్థుల దగ్గర మొబైల్, లాప్ టాప్, టీవీ వంటి ఉపకారణాలు ఉన్నాయి అనే సమాచారం అందుబాటులో ఉండాలి అని చెప్పారు. ప్రతీ విద్యార్థి కి ఇద్దరు లేదా ఒక ఉపాధ్యాయుడితో మాచింగ్ బాచింగ్ చేయాలనీ కోరారు.పాఠశాలలు ప్రారంభం అయ్యే సమాచారం (ఎస్ఎంసి) పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారాతల్లి తండ్రులకు అందించాలని కోరారు. వర్క్ షీట్స్, వీడియో పాఠాలు సిద్ధం చేసుకోవాలని కోరారు.