Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరికి ప్రత్యామ్నాయంగా పత్తి వ్యవసాయ శాఖకు సర్కార్ ఆదేశాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లోనూ పత్తి సాగుకే రైతులు అధికంగా మొగ్గుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. గత రెండేళ్లుగా పరిశీ లిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాలకు భిన్నంగా అదనంగా పత్తిని రైతులు సాగు చేస్తున్నారు. గత వానాకాలం, ఎండాకాలం వరి సాగు గణనీ యంగా పెరగడం, దిగుబడులు పెరగడంతో కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభు త్వానికి కష్టసాధ్యం మారింది. ఈ నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం వ్యవసాయ అధికారులను ఆదేశించింది. దీంతో అంచనాలను కూడా అధికారులు పెంచారు. 2019లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు కాగా, రైతులు 5.50 లక్షల ఎకరాల పత్తిని సాగు చేశారు. 2020లో 7.40 లక్షల ఎకరాల సాగుకు ప్రతిపాదించగా, 7.59 లక్షల ఎకరాల పత్తిని రైతులు సాగు చేశారు. 2021లో 9.09 లక్షల ఎకరాల సాగుకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం గమనార్హం. ప్రతియేటా పత్తి సాగు పెరుగుతుండడంతో ఈ ఏడాది కూడా గణనీయంగా పత్తి సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతియేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్లుగా భారీగా సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును తగ్గించడంలో భాగంగా ప్రత్యామ్నాయంగా పత్తి సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో ఈసారి పత్తి సాగు ప్రతిపా దనలు సైతం అధికారులు పెంచారు. రెండేళ్ల క్రితం 2019లో 5.50 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే గత ఏడాది 7.59 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయడంతో ఈసారి వానాకాలంలో 9.08 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వరిని తగ్గించడానికే..
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటల సాగులో భాగంగా వరిని గణనీయంగా తగ్గించడానికి ప్రణా ళికను ఖరారు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవ సాయ శాఖాధికారులు 8 లక్షల ఎకరాల మేరకు పత్తి సాగుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయగా, ప్రభుత్వం ఆదేశాలతో మరో లక్ష ఎకరాలను అదనంగా చేర్చడం గమనార్హం. ఎండాకాలం వరిసాగు పెరిగి, దిగుబడులు సైతం పెరిగిన విషయం విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తా మని హామి నిచ్చారు. ఈ హామీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీనికి తగ్గ ప్రణాళికను రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరైన ఏర్పాట్లు లేకపోవడం, ముఖ్యంగా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలిం చడానికి లారీలు లేకపోవడం, అన్లోడింగ్ కార్మికుల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఈ క్రమంలో వడగండ్ల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిల్లర్లు, కేంద్రాల నిర్వా హకులు కుమ్మక్కై తూకంలో బస్తాకు 2-3 కిలోల మేరకు కోత విధించడమే కాకుండా ధరల్లోనూ మోసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయంలో రైతులు ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి వరి సాగును తగ్గిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం వుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి పత్తి సాగును ప్రోత్సహించాలని సాగు ప్రతిపాదనలను పెంచాలని సూచించింది.
పత్తి సాగుకే మొగ్గు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పత్తి సాగుకే మొగ్గుచూపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పత్తి తట్టుకోవడం, పత్తి సాగులో రైతులు విశేష అనుభవం గడించడంతో పత్తి సాగుకే రైతులు పూనుకుంటున్నారు. నల్లరేగడి భూముల్లో నీటి వసతి వుంటే ఎకరాకు సుమా రు 15 క్వింటాళ్ల దిగుబడి, నీటి వసతి లేనిపక్షంలో 8-10 క్వింటాళ్లు, చెలక భూముల్లో నీటి వసతి వుంటే 6-7 క్వింటాళ్లు, నీటి వసతి లేకుంటే 5 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లోనూ ధరలు ఆశాజనకంగా వుండడంతో రైతులు పత్తి సాగుకే అధికంగా మొగ్గుచూపుతున్నారు. ప్రధానంగా వరంగల్ రూరల్, జనగామ, జయశంఖర్ భూపాలపల్లి, మహ బూబాబాద్ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
గతేడాది 7.59 లక్షల ఎకరాల్లో సాగు
గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7.59 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 82 వేల 842 ఎకరాలు, వరంగల్ రూరల్ జిల్లాలో 2 లక్షల 3 వేల 794 ఎకరాలు, జనగామ జిల్లాలో 1 లక్షా 83 వేల 447 ఎకరాలు, జయశంకర్భూపాలపల్లి జిల్లాలో 1 లక్షా 24 వేల 428 ఎకరాలు, మహ బూబాబాద్ జిల్లాలో 1 లక్షా 34 వేల 823 ఎకరాలు, ములుగు జిల్లాలో 30 వేల 505 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు.
ఈ వానాకాలం 9 లక్షలకుపైగానే..
ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా లో 9 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగు చేసే అవకా శాలున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. వరంగల్ అర్భన్ జిల్లాలో 1 లక్ష ఎకరాలు, వరంగల్ రూరల్ జిల్లాలో 2.38 లక్షల ఎకరాలు, జనగామ 2 లక్షల ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.35 లక్షల ఎకరా లు, ములుగు జిల్లాలో 50 వేల ఎక రాలు, మహబూబాబాద్ జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ భావిస్తుంది. ఈసారి మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే సుమారు 50 వేల ఎకరాల అంచనాలను పెంచారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 27 వేల ఎకరాలు, వరంగల్ రూరల్ జిల్లాలో 34 వేలు, జనగామలో 26 వేలు, ములుగులో 20 వేలు, జిల్లాలో 20 వేల ఎకరాల మేరకు అంచనాలను పెంచారు.