Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభం
నవతెలంగాణ-జనగామ
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం జనగామ ప్రధాన ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దఢ సంకల్పంతో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షలకు పేదలు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో, వైద్యం అంటే కేవలం డాక్టర్లు, ఔషధాలు మాత్రమే కాదని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు అత్యంత కీలకమని ప్రభుత్వం భావించిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా పరీక్షలతో పాటు, రక్త, మూత్ర, బిపి, షుగర్, గుండె, బొక్కల, లివర్ జబ్బులు, కిడ్నీ, థైరాయిడ్ తదితర 57 రకాల పరీక్షలు చేపడుతున్నట్లు, ఎక్సరే, ఇసిజి,2డి ఇకో, ఆల్ట్రాసౌండ్ డిజిటల్ ఎక్సరే లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోనే కాకుండా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నమూనాలు స్వీకరించి, పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో 40 లక్షల వ్యయంతో డయాగ్నోస్టిక్ కేంద్ర భవనం నిర్మించిమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రూ. 57 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకత జిల్లా కార్యాల యాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. నిఖిల, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, డిఎఫ్ఓ అర్పణ, డీసీపీ శ్రీనివాస రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఇ ఏ. మహేందర్ రావు, వైద్య ఆరో గ్యాధికారి డా.మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, పాల్గొన్నారు.