Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య
- మీ సేవా కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ-నర్సంపేట
ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ పేరిట బియ్యం పంపిణీ నిలుపుదల చేయడం సరైందికాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. సోమవారం పలు మీ సేవ కేంద్రాలను సందర్శించి అక్కడ పెద్ద సంఖ్యలో గుమికూడిన రేషన్ కార్డు లబ్దిదారులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానంతో సెల్ఫోన్ నెంబర్ లింక్ పేరిట రేషన్ సరుకులకు షరత్తు విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. వోటీపీ నెంబర్ ఆధారంతో రేషన్ సరుకులను పంపిణీ చేయడం సరైందే అయినప్పటికీ కరోనా సమయంలో షరత్తు విధించి పంపిణీ చేయకుండా నిలుపుదల చేయడం వల్ల కార్డు దారులు ఇబ్బందులకు గురైతున్నారని తెలిపారు. ఈ నిర్ణ యాన్ని వెంటనే వెనక్కి తీసుకొని సామాన్య ప్రజలందరికీ బియ్యం పంపిణీ చేయాలన్నారు. రేషన్ కార్డుదారులు మీ సేవా కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడడం వల్ల వైరస్ భారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింకు గడువు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మీ సేవ కేంద్రాల ఏజన్సీ వారు ఒక్కో రేషన్కార్డుదారుడి వద్ద రూ.50లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం మీ సేవా ఏజన్సీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు భిన్నంగా మీ సేవా కేంద్రాల నిర్వాహుకులు అక్రమంగా ఫీజు వసూళ్లు చేస్తూ దోపిడికి పాల్పడడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. వెంటనే అధికారులు స్పందించి మీ సేవా కేంద్రాల ఏజన్సీలను తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త రేషన్ కార్డు ధరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ పాక సమ్మక్క, అనిల్ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.