Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఉద్యోగుల నిరసన
నవతెలంగాణ-ములుగు
కరోనా బారిన పడి మృతి చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆ శాఖ ములుగు ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వేదిక ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో మంగళవారం నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగస్తుల కుటుం బాలకు వ్యాక్సినేషన్ చేయాలని, ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పీఆర్సీపై పునరాలోచించి మెరుగైన పీఆర్సీ ఇప్పించాలని, కొవిడ్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు 20 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని, కోవిడ్ బారిన పడి చనిపోయిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగుల స్థానంలో వారి వారసత్వ వారికి ఉద్యోగం శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు సుధాకర్, రవీందర్, సాంబయ్య మల్లయ్య, వినోదర్, నాగమణి, స్రవంతి, ప్రశాంతి, ఉష, సమ్ము దమ్ము లాల్నాయక్, తదితరులు పాల్గొన్నారు.