Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మంగళవారం నుంచి రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేస్తున్న సందర్భంగా కృతజ్ఞతగా గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం హసన్‌పర్తి రైతు వేధిక ఆవరణలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చెయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎకరాకు రూ.5వేల చొప్పున 63 లక్షల 25వేల మందికి రూ.7508.75 కోట్లు రైతులకు నగదు బదిలీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారకణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన కూడా రైతుల సంక్షేమం కోసం వానాకాలం 2021-22 పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న ముఖ్య మంత్రికి వర్ధన్నపేట నియోజకవర్గ రైతుల పక్షాన కతజ్ఞతలు తెలిపారు. రైతు బందు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈవోలు కల్పన, భాస్కర్, క్రాంతికుమార్, ఎంపీపీ కేతపాక సునితరాజు, జడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ అంచూరి విజరుకుమార్, పీఏసీఎస్ చైర్మన్లు బిల్ల ఉదరురెడ్డి, జక్కుల రమేష్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ డైరెక్టర్లు వీసం కర్ణాకర్‌రెడ్డి, నేదునూరి కుమారస్వామి, టీఆర్ఎస్ డివిజన్ యూత్ అధ్యక్షుడు వల్లా శ్రీకాంత్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎర్రోల్ల శ్రీనివాస్, పిట్టల సదానందం, నాగరాజు, గోళి విద్యాసాగర్, భాస్కర్‌రెడ్డి, రమాదేవి, వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ సుభాష్‌గౌడ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
55వ డివిజన్లో...
రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న సందర్భంగా 55వ డివిజన్ పరిధి భీమారం ముచ్చర్ల క్లస్టర్ రైతు వేధికలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లుయాదవ్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు సంగాల విక్టర్‌బాబు, భీమారం కోఆర్డినేటర్ చింతల రమేష్‌యాదవ్, తోట రవి, చింతల బొందలు, బేతేల్లి విజరు, బేతేల్లి వినరు, చింతల అనిల్, గుంజ సాయికుమార్, హషీకేశ్ తదితరులు పాల్గొన్నారు.
1వ డివిజన్లో...
కరోనా కష్ట కాలంలోను రైతు బంధు పెట్టుబడి సహాయంతో అన్న దాతకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నుంచి రైతులకు నగదు బదిలీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రేటర్ 1 వ డివిజన్ పరిధి ఎరగట్టుగుట్ట జంక్షన్ వద్ద టీఆర్ఎస్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ముచ్చర్ల, పలి వేల్పుల గ్రామాల రైతు బంధు అధ్యక్షులు కన్నెబొయిన రాజుయాదవ్, పోతారబోయిన అంకూస్బాబు, నంది శ్రీనివాస్, తోట నాగరాజు, మూల దేవేందర్, పులెంట్ల శ్రీదర్, సూర సతీశ్‌యాదవ్, చిర్ర రాజేష్, చిర్ర రాజేందర్, సాంబ శివరెడ్డి, చిర్ర సుమన్, మట్టెడ అనిల్, కత్తెరశాల ప్రశాంత్, గొల్లపల్లి శ్రీకాంత్, దీలిప్, ప్రదీప్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.