Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని మొట్లపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ సేవా కేంద్రాన్ని మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
మొదటి విడత రైతు బంధు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపిడిఓ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కషి చేస్తున్నారన్నారు.కరోన కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం 35 మంది లబ్దిదారులకు 11,25,900 ల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యార సుజాత సంజీవరెడ్డి, జెడ్పిటిసి జోరుక సదయ్య, పిఏసీఎస్ చైర్మన్ నరసింగారవు,తహశీల్దార్ సమ్మయ్య, టిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రావు, ఎంపిడిఓ రామయ్య,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.