Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేయూ వీసీ ఆచార్య టి.రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే హరితహారానికి సన్నద్దం కావాలని కేయూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రమేష్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కమిటీ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో కేయూ పాలక మండలికి పలు సూచనలు చేశారు. ఒక ప్రణాళిక, పద్దతి ప్రకారం మొక్కలు నాటడం చేపట్టాలన్నారు. నాటిన మొక్కలను కాపాడాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు. హరితహారం చేపట్టడానికి క్యాంపస్‌లోని వివిద ప్రదేశాలను పరిశీలించారు. ముఖ్యంగా క్యాంపస్‌లోని ఇంజనీరింగ్ కళాశాల మైదాన ప్రాంతం, వ్యాయామ కళాశాల వసతి గృహ పరిసరాలు, ఆడిటోరియం ఎదురుగా ఉన్న చెక్ డ్యాం పరిసరాలు, క్యాంపస్ ఆవల ఉన్న ప్రాంతాలు, క్యాంపస్‌లోని మొదటి గేటు, రెండవ గేటు ఇరుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.మల్లారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.డెవిడ్, అభివృద్ది అధికారి ఆచార్య వి.రామచంద్రం, అవెన్యూ ప్లాంటేషన్ ఇంచార్జి డాక్టర్ మహ్మద్ ముస్తాఫా, ఎన్ఎస్ఎస్ సమన్వయ అధికారిణి డాక్టర్ ఎస్.జ్యోతి, వసతి గృహ సంచాలకులు డాక్టర్ మామిడాల ఇస్తారి, ఇంజనీర్ భవాణిప్రసాద్, సహాయ రిజిస్ట్రార్లు అశోక్‌బాబు, వల్లాల పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.