Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-వరంగల్
వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్, అరటి, బొప్పాయి సాగు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ప్రతి మండలంలో చిరుధా న్యాలు కనీసం వెయ్యి ఎకరాలు పండించేలా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పైలట్ పంటగా కనీసం గ్రామానికి 5 ఎకరాల చొప్పున పండించాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, అధికారులు అందుబాటులో వుండాలని సూచించారు. ఈసారి వరి పంట మార్చి 31వ తేదీవరకు కోతలు పూర్తి చేయాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుండి తీసుకువచ్చిన పశువులు మన రాష్ట్రంలో వున్న వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నాయ న్నారు. వాటిని చిన్నతనంలోనే ఇక్కడికి తీసుకువచ్చి పోషించడం వల్ల ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతాయన్నారు. ఈ విషయంలో రైతులకు తగు సూచనలు చేయాలన్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం వుందని, పశువులకు సంబంధించి అంటువ్యాధులు వచ్చే అవకాశముం దన్నారు. పశు వైద్యశాలల్లో సిబ్బంది అందుబాటులో వుండాలని సూచించారు. మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ మందులు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులు నర్సరీలను ఎక్కువగా పెంచాలని వాటిలో ఎక్కువగా వేప, రావి, నేరెడు వంటి మొక్కలు పెంచాలన్నారు. మత్స్య శాఖాధికారులు జిల్లాలో ఎక్కువ మొత్తంలో చేపలను, రొయ్యలను సాగు చేసేవిధంగా కృషి చేయాలన్నారు. వారం రోజుల్లో మత్స్య శాఖ అధికారులు, సీడ్ కమిటీ సభ్యులు మత్స్యకారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మార్కెటిం గ్ అధికారులు అవసరమైన చోట గోదాములను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, వరంగల్ రూరల్ జిల్లా వ్యవసాయాధికారి ఉషా దయాళ్, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.